Saturday 27 September 2014

కన్నీటి సంద్రంలో చుక్కాని లేని నావ లాంటి ఈ పయనం ఎందాకా సాగెనో
అలుపు లేని మలుపులతో ఉన్న జీవితం ఎప్పటికి మారునో

Thursday 20 February 2014

Situation:-
There's a prostitute in Mumbai who's got caught into that hell...she had a baby and she is 6 years old.Another girl there,with her intelligence,gets out of that place who wants to take that 6 yrs girl out of there.Her mother who is caught in the hands of those harassing people didn't want her kid to stuck there.So she sends her with that girl.This is a mother's grief.

వెళ్ళమని చెప్పలేను...
ఉండమని అడగలేను...
ఆడదాన్ని చెడు ద్రుష్టితో చూసే దుష్టులు ఉన్న ఈ నరకంలో...
ఏళ్ళుగా ప్రతి రోజూ నువ్వు లేనప్పుడు ఏడుస్తూ,ఉన్నప్పుడు ఆ బాధని నీకోసం దిగమింగుకుంటూ బ్రతుకుతున్నాను...
నీకోసమే నిన్ను దూరం చేసుకుంతున్నాను...
ఒక వైపు చాలా త్రుప్తిగా ఉన్నా మరొక వైపు గుండె పగిలేంత బాధగా ఉంది...
ఒక్కటే కోరుకుంటున్నాను...నన్ను ద్వేషించకు...

Inspired by... an episode of  GUMRAH (a show on channel V ).

Saturday 1 February 2014

new song...

ఏమిటో సరికొత్తగా తోచె మరి ఎందుకో...
కలలను వదలననే కనులేలనో...
పదములనే నీ వైపు తిప్పుకుని మనసునే నీ వశం చేసుకుని నాలో ఈ గిలిగింతకే ఈ రోజు ప్రేమ అన్న పేరు పెట్టావు...
ఈ నిజం కల కాదుగా...మరొ జన్మే నీ ప్రేమలో కలిగేంతలా ఏ మంత్రమేసావో.....
నీ మౌనం భాషైనదే...నేనెన్నడూ ఊహించని పదాలనే పలికేనెలా ఈ భాష పేరేంటో.....

కడలే పొంగెనులే,అలలై ఎగసెనులే,తన దరినే ఉన్న నీ పాదాలను ముద్దాడేందుకు...
కనులే మూసెనే,నింగి నిదరే పోయెనే,తన కనులలొ ఉన్న నీ రూపాన్నే బంధించేందుకు...

Saturday 16 March 2013


చిరుజల్లు లాగా తొలకరిలో రాగా తను ఏదో మాయె చేసింది లే...
నడిచేటి దారి తన వెంట రాగా తన దారి నీతో నడిచేను లే...
ఇది స్వర్నమా లెక పున్నమా,ఏ వర్నమో తేలేదెలా...
ఇది అందమా మరు చంద్రమా,ఈ మధురిమా తెలిసేదెలా.....

నిను చూసే వేల యెదలో ఈ సవ్వడులూ,వినలేద నువ్వు నాలో అలజడులు...
కన్నుల్లో ఏదో మర్మం దాగి ఉన్నది,మాటల్లో తెలుపనేలేని మంత్రమున్నది...
కలలలోన నిన్నే కనగా కవినయ్యాను లే,ఇలలలొన నువ్వే ఎదురై సిలనయ్యాను లే.....

పరుగున నడిచేనే నీతొ నా అడుగు,వీల్లేదంటున్నా మళ్ళదు గా నా వైపు...
నీతో నీ నీడ లాగా పయనించేనే,నా హ్రుదయం నీ ఊసులనే నాకు చెప్పెనే...
నిదురలోన ఐనా విడనేలేదు నన్ను,కొంటెగ నను చూసి కాల్చే నీ రూపం.....

Wednesday 6 March 2013


సమస్త ఝరులు సముద్రాన్ని ఆశ్రయించనినాడు,
సూర్యుడు ఉదయించనినాడు,
చూపుని కన్ను చిన్నచూపు చూసిననాడు...
మనుషులు మనసులని వీడి జీవఛ్ఛవాలుగా మిగిలిననాడు...
తల్లి ప్రేమ జగతిలో అంతరించిననాడు...
ఇవన్నీ జరిగిననాడు చెప్పు నిన్ను మరచిపోమని.....

Tuesday 5 March 2013

హృదయ సంద్రంలో ఆశల కెరటాలు ఎగసిపడుతున్నాయి .
అవి నీ పదములను  స్పృశించాలని ఆరాటపడుతున్నాయి..... 

Thursday 28 February 2013

రెప్పపాటు కాలం జీవితం ఐతే ,
కనురెప్ప వేయకుండా  నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను .....